15నుండి 18 వరకు నల్గొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్ పటేల్
*సదాశివనగర్ మండల కేంద్రంలో పోస్టర్లు ఆవిష్కరించిన రైతు సంఘం నాయకులు
నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు సదాశివ నగర్ మండల కేంద్రంలో జరిగిన రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని జిల్లా కార్యదర్శి పబ్బ దశరథ్ పటేల్ తెలిపారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల సమస్యల పరిష్కారంలో ఈ మహాసభలు కీలకమని పేర్కొన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి చారిత్రక నేపథ్యమున్న నల్గొండ గడ్డపై జాతీయ మహాసభలు నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. *నవంబర్ 15న లక్షలాది మంది రైతులతో మహా ప్రదర్శన, బహిరంగ సభ* నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 4000లకు పైగా ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొననున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు పార్టీలకు అతీతంగా సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కే రంజిత్ రావు ఎల్ ప్రవీణ్ రేపని రాములు డి ప్రవీణ్ రావు కే మల్లయ్య భూపతి మహేందర్ రాములు సుధాకర్ రాజయ్య వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.