🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 9:24 pm Posted by : Kancharala Shivakumar

అక్బర్‌పేట భూంపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన -చెరుకు శ్రీనివాస్ రెడ్డి

News Image
దుబ్బాక ప్రతినిధి,అక్బర్‌పేట భూంపల్లి,నవంబర్ 12, తెలంగాణ కెరటం:అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో నగరం, భూంపల్లి, బేగంపేట గ్రామాలలో రైతుల సౌకర్యార్థం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అక్బర్‌పేట భూంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శంకర్,pacs వైస్ చైర్మన్ కాల్వ నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏలూరి కమలాకర్, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మారెడ్డి, తిప్పన బోయిన పున్నవ్వ, మండల ప్రధాన కార్యదర్శి పాతూరి ప్రదీప్ రెడ్డి, నగరం ఉపసర్పంచ్ జీడిపల్లి రమేష్, బేగంపేట గ్రామ సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి పాతురి శ్రీనివాస్ గౌడ్, వేల్పుల యాదయ్య, స్వామి, ఆలయం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home