🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 9:27 pm Posted by : Kancharala Shivakumar

బహుజనల హక్కుల కోసం ఉద్యమించాలి -దుబ్బాక మండల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకుల పిలుపు

News Image
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 12,తెలంగాణ కెరటం:ఈనెల 20వ తారీఖున దుబ్బాక మండల ఎస్సీ,ఎస్టీ, బిసి మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని గురువారం రోజున దుబ్బాక మండల బహుజన నాయకులు అందరూ పిలుపునివ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో హక్కుల సాధన కోసం అదేవిధంగావెనుకబడిన వర్గాల ప్రజలకు తమ హక్కుల కోరకై తమ ఆత్మగౌరవ సామాజిక మనత్వ న్యాయం కోసం ఉద్యమించవలసిన అవసరము ఎంతో ఉన్నదని తెలిపారు కావున దుబ్బాక మండల పరిధిలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరూ పార్టీలకతీతంగా ఈనెల 20 తారీఖున వైశా భవన్ దుబ్బాకలో జరిగేటువంటి సమావేశాన్ని విజయవంతం చేసి మన హక్కుల సాధనలో ముందుండాలని పిలుపునిచ్చారు.
🏠 Home