🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 10:00 pm Posted by : RAMESH CHITYALA

సింగపురం ఇందిరా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

News Image
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 12స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సింగపురం ఇందిరా గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగపురం ఇందిరా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు యువ నాయకులు సింగపురం ఇమ్మాన్యుయేల్ రాజ్ కూడా పాల్గొన్నారు.
🏠 Home