వాణిజ్య భవనాల ఆస్తి పన్ను పెంపుపై వ్యాపారులతో సమావేశం

- ప్రభుత్వ నిబంధనల మేరకు పన్నుతగ్గింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం
జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ రావు
ములుగు జిల్లా బ్యూరో,(తెలంగాణ కెరటం) నవంబర్ 12: వాణిజ్య భవనాల ఆస్తి పన్ను తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలమేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు.గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ములుగు మున్సిపాలిటీ పరిధిలోని వాణిజ్య భవనాల ఆస్తి పన్ను పెంపుపై మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు,వాణిజ్య భవనాల యజమానులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వాణిజ్య భవనాల ఆస్తి పన్నును యూనిట్‌కు 30 పైసలుగా నిర్ణయించడంతో గతంలో చెల్లించిన ఆస్తి పన్ను కంటే ప్రస్తుతం భారీగా పెరిగిందని పలువురు వ్యాపారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పన్ను పెంపు వల్ల తమపై అదనపు భారం పడుతోందని, పన్ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ములుగు మున్సిపాలిటీ పరిధిలోని వాణిజ్య భవనాలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కమిషనర్ నిబంధనలు,జీఓ నెం.230,తేదీ 11.12.2020 ప్రకారం క్యాపిటల్ వాల్యూ నిర్ణయించ బడిందని,దానికి అనుగుణంగానే వాణిజ్య భవనాల ఆస్తి పన్ను నిర్ధారించడం జరుగుతుందని వివరించారు.నివాస భవనాల ఆస్తి పన్నులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరగడం వల్ల ఆయా ప్రాంతాలను బట్టి క్యాపిటల్ వాల్యూ కూడా అప్‌డేట్ అవుతుందని తెలిపారు.వాణిజ్య భవనాల యజమానుల సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఆస్తి పన్ను తగ్గింపునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి,వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్,మున్సిపల్ కమిషనర్ సంపత్, మేనేజర్ రాజేందర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్స భ్యులు,వాణిజ్యభవనాల యజమానులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.