మందమర్రి ఏరియాలో ఘనంగా బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం....

నినాదం: నాణ్యతే ప్రగతికి ప్రమాణికం - దాని పరిరక్షణ అందరి బాధ్యత".....సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ.......తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల... మందమర్రి నవంబర్ 12, 2026 నుండి నవంబర్ 18, 2026 వరకుసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నేడు (12/11/2026) బొగ్గు నాణ్యత వారోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. "నాణ్యతే ప్రగతికి ప్రమాణికం, దాని పరిరక్షణ అందరి బాధ్యత" అనే ముఖ్య నినాదంతో ఈ వారోత్సవాలు నవంబర్ 18 వరకు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి.
ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి క్వాలిటీ పతాకాన్ని ఎగురవేసి వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ... మన ప్రియతమ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఐ.ఏ.ఎస్. సుదూర దృక్పథం, సమర్థవంతమైన సారథ్యంలో సింగరేణి సంస్థ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి బొగ్గు ఉత్పత్తి సంస్థగా వెలుగొందుతోందని కొనియాడారు. గత 136 సంవత్సరాలుగా దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు మరియు ఇతర పరిశ్రమలకు అత్యుత్తమ నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో సింగరేణి సంస్థ సుస్థిర స్థానం సంపాదించుకుందని తెలిపారు.కంపెనీ మొత్తంలో మందమర్రి ఏరియా నాణ్యతా ప్రమాణాలతో పాటు బొగ్గు ఉత్పత్తి మరియు డిస్పాచ్ (రవాణా) రంగాలలో ముందు వరుసలో ఉందని జి.ఎం. గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలన్నిటి వెనుక యాజమాన్యం, అధికారులు, కార్మికుల సమిష్టి కృషి దాగి ఉందన్నారు. మందమరి ఏరియాలో ప్రతి బుధవారం అందరం కలిసి ఒక టీమ్‌లా పనిచేస్తూ ఈ బుధవారం నాడు ఏకంగా మూడు రేకులు (Rakes) సుమారు 13,000 టన్నుల బొగ్గును విజయవంతంగా డిస్పాచ్ చేసినట్లు తెలిపారు. ఈ అద్భుతమైన మైలురాయిని సాధించేందుకు శ్రమించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ప్రస్తుతం సింగరేణి కంపెనీలో మందమరి ఏరియా 100% ఉత్పత్తిని సాధిస్తూ ముందంజలో ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ బొగ్గు నాణ్యత (Quality) విషయంలో సింగరేణి సంస్థకు మరియు మందమరి ఏరియాకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నిరంతరం లక్ష్యంతో కూడిన ఉత్పత్తిని సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం, జి ఎల్. ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ సిహెచ్.అశోక్, సీఎం ఓ ఏ ఐ వైస్ ప్రెసిడెంట్ రవి, క్వాలిటీ మేనేజర్, ప్రదీప్, ఏఐటీయూసీ జిఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సివి రమణ, జియం ఆఫీస్, ఫిట్ సెక్రటరీ సృజన గీతిక, జిఎం ఆఫీస్ ఉన్నత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.