మందమర్రిలో అక్రమ బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కుపాదం 101.5 లీటర్ల మద్యం స్వాధీనం
బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం... మందమర్రి సి.ఐ. పి రమేష్ హెచ్చరికతెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మంచిర్యాల..మందమర్రిఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) రమేష్ పర్యవేక్షణలో మందమర్రి సబ్-ఇన్స్పెక్టర్ (SI) జి నరేష్ మరియు పోలీసు సిబ్బంది పట్టణంలోని బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న 4 బెల్ట్ షాపులను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఆయా షాపుల నుండి సుమారు ₹71,000/- విలువైన 101.5 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మందమర్రి సి.ఐ. రమేష్ మీడియాతో మాట్లాడుతూ మందమర్రి సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలను, బెల్ట్ షాపుల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. బెల్ట్ షాపుల వల్ల గ్రామాలు, కాలనీలలో శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇప్పటికైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారు స్వచ్ఛందంగా వాటిని మూసివేయాలి. పదేపదే అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడితే కేవలం కేసులతో సరిపెట్టకుండా, బైండోవర్ కూడా చేస్తామని. ఎక్కడైనా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి, వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం" అని అన్నారు, అక్రమంగా కిరాణం షాపుల్లో కాని ఇండ్లల్లో కానీ మద్యం నిలువ ఉంచి అమ్మినట్లు మా దృష్టికి వస్తే అమ్మకాలు జరిపే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.