🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 6:29 am Posted by : TELANGANA KERATAM

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

News Image
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పెండింగ్ క్లెయిమ్‌లు వెంటనే మంజూరు చేయాలి
50 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.05 వేల పెన్షన్‌ ఇవ్వాలి
ఏఐటీయూసీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఏఐటీయూసీ అనుబంధ టీఎస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్) సురేందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రామిల్ల రాంబాబు, కార్యదర్శి ఏశమేని గణేష్ మాట్లాడుతూ..జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించి, అర్హులైన కార్మికులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5,000 పెన్షన్ అందించాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని కోరారు. ఏఎల్‌ఓ కార్యాలయాల వద్ద కొనసాగుతున్న దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, కార్మికులకు క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎస్సీ హెల్త్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న హెల్త్ చెకప్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మిక సంక్షేమ బోర్డు నిధులు వృథా కాకుండా కాపాడాలని పేర్కొన్నారు. కార్మిక శాఖ పరిధిలోని సంక్షేమ బోర్డులలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిన అగ్రిమెంట్లను రద్దు చేసి, బోర్డు ఆధ్వర్యంలోనే కార్మికులకు క్లెయిమ్‌లను నేరుగా అందజేయాలని కోరారు. ఆధార్, గ్యాప్, ఇతర సర్టిఫికెట్ల పరిశీలన బాధ్యతలను ఏఎల్‌ఓల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, కార్మికులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని రామిల్ల రాంబాబు, ఏశమేని గణేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీపిఇటిఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఖాదర్ మొహియుద్దీన్, ఏఐటియూసీ గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్న మహేష్, ప్రధాన కార్యదర్శి ఎండి ముక్రం, ఉపాధ్యక్షుడు ఖాతా వినయ్, మామిడి రాజన్న, ఎండి ఉస్మాన్, కోశాధికారి మాడిశెట్టి కిరణ్ కుమార్, అందే వంశీ, ఎండి సమీర్, బిజనపెల్లి మనోహర్, గాజులవర్తి రమేష్, మరంపల్లి రాజశేఖర్, గని, ఖాతా యాది, దేవేందర్, మజీద్, అంకం రావు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home