గడి బురుజుల స్థలంపై విధించిన వీఎల్టీని తక్షణమే రద్దు చేయాలి

మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లకు వినతి పత్రం అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : కోరుట్ల పట్టణంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన గడి బురుజుల స్థలంపై మున్సిపాలిటీ విధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ)ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి, మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్రలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. గడి బురుజుల స్థలం పట్టణానికి సంబంధించిన విలువైన ప్రజా ఆస్తి అని, చారిత్రకంగా, ప్రజాపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. అటువంటి భూమిపై వీఎల్టీ విధించడం వల్ల ప్రజల్లో ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో ఈ అంశాన్ని పెట్టి, వీఎల్టీని రద్దీ చేయాలని ప్రత్యేకంగా కోరారు. గడి బురుజు భూమిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించాల్సిన అవసరం ఉందని, ఆ భూమిపై విధించిన వీఎల్టీని తక్షణమే రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. ప్రజా ఆస్తులను కాపాడటంతో పాటు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, అధికారులు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హఫీజ్ బాబా, వసీం, మోసిన్, పొట్ట సురేంధర్, కొక్కెర వెంకటేష్, ఎలుగూరి శ్వేతా కిరణ్, జాల మాధవి తదితరులు పాల్గొన్నారు.