🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 6:48 am Posted by : TELANGANA KERATAM

అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో చెంచులకు ప్రత్యేక వార్డులు.

News Image
  • అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో చెంచులకు ప్రత్యేక వార్డులు.
అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో చెంచులకు ప్రత్యేక వార్డులు.

చెంచులకు మెరుగైన వైద్యం అందించాలి.

గర్భిణీలకు బర్త్ వెయిటింగ్ వార్డు లు , చిన్నపిల్లల ప్రత్యేక వార్డు లను డివిజన్ సబ్ కలెక్టర్ తో కలిసి 
ప్రారంభించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13)

 నల్లమల లోతట్టు ప్రాంతాల్లో నివసించే మారుమూల గిరిజన తెగ అయిన చెంచులకు (చెంచు ట్రైబ్ )లకు మెరుగైన ఉచిత వైద్యం అందించడం అత్యంత ఆవశ్యకమైన విషయం. అని స్థానిక 
ఏమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక కృషితో చెంచులు వైద్యానికి ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి వారికి ప్రత్యేక వసతులతో కూడిన వార్డులను ఏర్పాటు చేస్తున్నారు.గతంలో నల్లమల చెంచులకు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో చెంచులకు మెరుగైన కార్పొరేట్ సాయి వైద్యం అందించారు.
అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో నల్లమల అటవీ ప్రాంత ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా సేవలందిస్తోందని ప్రత్యేక గిరిజన/చెంచు వార్డులు (స్పెషల్ ట్రైబల్ వార్డ్స్ ఐటీడీఏ (ఐటీడీఏ) పరిధిలోని ప్రత్యేక గిరిజన తెగల(పివీ టిజిఎస్) కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక ఏరియా ఆసుపత్రులు మరియు పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులను కేటాయించాల్సి ఉంది. దీనివల్ల అడవి లోపలి పెంటల (గ్రామాల) నుండి వచ్చే చెంచులకు త్వరగా వైద్యం అందుతుందని 
నల్లమల మారుమూల ప్రాంతాల చెంచులకు అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండేలా చూడటం వారి ఆరోగ్య భద్రతకు ఎంతో అవసరం కాబట్టి వైద్యులందరూ కూడా చెంచులకు అందుబాటులో ఉండి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం మన బాధ్యతని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ ఎం ఓ ప్రదీప్ డాక్టర్లు మహేష్ ,ప్రశాంత్ ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home