🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 6:53 am Posted by : TELANGANA KERATAM

వనపర్తి పట్టణంలో సురవరం ప్రతాపరెడ్డి పార్క్ ను ప్రెస్ క్లబ్ గా మార్చొద్దు బి ఆర్ ఎస్ నాయకుల నిరసన

News Image

వనపర్తి పట్టణంలో సురవరం ప్రతాపరెడ్డి పార్క్ ను ప్రెస్ క్లబ్ గా మార్చొద్దు బి ఆర్ ఎస్ నాయకుల నిరసన ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాన్ని నిరాకరిస్తూ బిఆర్ఎస్ నాయకుల ధర్నావనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఉన్న సురవరం ప్రతాపరెడ్డి పార్క్ ను ప్రెస్ క్లబ్ గా మార్చాలని ఎమ్మెల్యే ఆలోచన సరైనది కాదని మాజీ మున్సిపల్ చైర్మన్లు బొలమోని కృష్ణయ్య, గట్టు యాదవ్,పలుస రమేష్ గౌడ్ గారు మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గారు స్థానిక 22వ వార్డు కౌన్సిలర్ ఎర్వ అరుణ మెకానిక్ శ్రీనివాసులు గారు మరియు బిఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు పాత్రికేయులకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు జర్నలిస్టుల సంక్షేమానికి వారి హక్కులకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది అయితే ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సురవరం ప్రతాప్ రెడ్డి పార్కు సరైన స్థలం కాదన్నదే మా విజ్ఞప్తి.ప్రజల కోసం ఏర్పాటుచేసిన పార్కును యధావిధిగా కొనసాగిస్తూ పాత్రికేయుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మన అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు.ఈ మేరకు ఈరోజు సురవరం ప్రతాపరెడ్డి పార్క్ లో బిఆర్ఎస్ నాయకులు బైఠాయించి ఎమ్మెల్యే ఏకపక్షం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బి నిరంజన్ యాదవ్ గారికి వినతి పత్రం అందజేసి పార్కులో ఇతరత్రా నిర్మాణాలు చేపట్టడానికి మున్సిపల్ చట్టం అనుమతించని నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి పూనుకుంటే చట్టబద్ధ చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.పాత్రికేయుల సంక్షేమానికి మద్దతిస్తూనే ప్రజల కోసం ఉన్న పార్కును పరిరక్షించాలన్నదే బిఆర్ఎస్ పార్టీ అభిమాతం అని అన్నారు.వినతి పత్రం సమర్పించిన వారిలో నందిమల్ల. అశోక్, గంధం. పరంజ్యోతి, మాజీ కౌన్సిలర్ ఉంగుళం. తిరుమల్, నాగన్న యాదవ్, స్టార్ రహీం,నీలస్వామి, సూర్య వంశం.గిరి,జోహెబ్ హుస్సేన్,హేమంత్ ముదిరాజ్,సునీల్ వాల్మీకి,హరీఫ్,ఏకే పాషా,అనుపటి రాము ఇంతీయజ్,రాజోలీ. నిరంజన్,వజ్రాల.రమేష్ ఉన్నారు.జానకిరామ్ తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి
🏠 Home