🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:12 am Posted by : TELANGANA KERATAM

నవంబర్ 15న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జన్‌జాతీయ గౌరవ దివస్ వేడుకలు

News Image
నవంబర్ 15న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జన్‌జాతీయ గౌరవ దివస్ వేడుకలు
బిర్సా ముండా జయంతి సందర్భంగా భారీగా తరలిరావాలని బీజేపీ నేతల పిలుపు
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 11: భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 15వ తేదీని జన్‌జాతీయ గౌరవ దివస్‌గా నిర్వహించనున్న సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో పోచారం డివిజన్ అన్నోజిగూడలోని బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జి ఎన్. బిక్కునాథ్ నాయక్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రాము నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, బిజెపి సీనియర్ నాయకులు దారావత్ తావుర్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం జల్, జంగల్, జమీన్ నినాదంతో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన భగవాన్ బిర్సా ముండా సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ నెల 15న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న జన్‌జాతీయ గౌరవ దివస్, బిర్సా ముండా జయంతి వేడుకలకు మేడ్చల్ జిల్లా నుంచి గిరిజనులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బిర్సా ముండా ఆశయాలను, ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, గిరిజన మోర్చా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home