కాలనీవాసుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా.. ప్రశాంత్ నగర్‌లో 2,121 గజాల స్థలాలకు రక్షణ

పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాల్ స్థలాల పరిరక్షణ.. హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 13: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం అన్నోజిగూడ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలాల ఆక్రమణల విషయంపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి ఆయా స్థలాలకు రక్షణ కల్పించారు. గ్రామ పంచాయతీ ఆమోదించిన లేఅవుట్‌లోని సర్వే నంబర్లు 94, 95లో పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం కేటాయించిన మొత్తం 2,121 గజాల స్థలాన్ని హైడ్రా పరిరక్షణలోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాల నిర్మాణం కోసం 868 గజాలు, పార్కు అవసరాల కోసం 765 గజాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 488 గజాలు చొప్పున మొత్తం 2,121 గజాల స్థలాన్ని లేఅవుట్‌లో కేటాయించారు. అయితే ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఈ స్థలాలు ఆక్రమణలకు గురయ్యే పరిస్థితి ఉండటంతో కాలనీవాసులు ఈ విషయాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. కాలనీవాసుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా అధికారులు ఆయా స్థలాలను పరిరక్షిస్తూ ప్రత్యేక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి హద్దుల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ భూములు హైడ్రా పరిరక్షణలో ఉన్నాయని, ఎవరైనా అక్రమంగా ప్రవేశించినా, ఆక్రమణలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డుల ద్వారా హెచ్చరించారు. ఆక్రమణదారులపై ప్రాసిక్యూషన్ చేపడతామని స్పష్టం చేశారు. కాలనీవాసుల ఫిర్యాదుకు స్పందించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాల్ స్థలాలను కాపాడిన హైడ్రా అధికారులకు ప్రశాంత్ నగర్ కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కబ్జాల బారిన పడకుండా పరిరక్షించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ స్థలాలను భవిష్యత్తులో ప్రజల అవసరాలకు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ కాలనీ అధ్యక్షుడు గంట సోమిరెడ్డి, కోశాధికారి బీన బోయిన శ్రీనివాస్, బర్ల మోహన్ రామారావు, మెతుకుపల్లి వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భూక్య పాల్ సింగ్, మహేందర్ రెడ్డితో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొని హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.