🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:16 am Posted by : TELANGANA KERATAM

పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించాలి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు పోరాటం

News Image
పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించాలి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు పోరాటం
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలి.. తెలంగాణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కమిటీ డిమాండ్
(తెలంగాణ కెరటం) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, నవంబర్ 13: జిల్లాలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కల్పించి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ పౌర సంక్షేమ సంఘం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించింది. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర నాయకులు తీగల వెంకటేష్, తూటి రాంచందర్, ఎన్.ఎన్. రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తూటి రాంచందర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి నివాస స్థలం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించడంలో విఫలమయ్యాయని, ఎన్నో సంవత్సరాలుగా స్థలాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఎలాంటి వివక్షకు తావులేకుండా పారదర్శకంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న బాధితులందరికీ తెలంగాణ పౌర సంక్షేమ సంఘం అండగా నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు సాధించి ఇచ్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పేదలకు న్యాయం జరిగే వరకు నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తామని జిల్లా కమిటీ ప్రకటించింది. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఇల్లేందుల స్వామి, ప్రమీల, కృష్ణంరాజు, చంద్రకళ, శోభతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇళ్ల స్థలాల బాధితులు సుమారు 50 మంది పాల్గొన్నారు.
🏠 Home