🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:22 am Posted by : TELANGANA KERATAM

బస్టాండ్ కూడలి వద్ద నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, బ్రిడ్జి మరియు రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే.

News Image
బస్టాండ్ కూడలి వద్ద నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, బ్రిడ్జి మరియు రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13):
అచ్చంపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ కూడలి వద్ద నిర్మిస్తున్న అండర్ డ్రైనేజీ బ్రిడ్జి మరియు రోడ్డు విస్తరణ పరులను శుక్రవారం టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించారు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.పట్టణ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.అచ్చంపేట పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
🏠 Home