🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 12:35 pm Posted by : MADATHALA NAVEENKUMAR

ముఖ్య సమాచారం ఆహ్వానం నూతన పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం,

News Image
ముఖ్య సమాచారం ఆహ్వానం నూతన పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం,
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్కౌన్సిలర్ సభ్యులకు కో-ఆప్షన్ సభ్యులకు నమస్కారం.ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నాము. తేదీ: 16-11-2026 (సోమవారం) సమయం: ఉదయం 10:30 గంటలకువేదిక: లక్ష్మీదేవి గార్డెన్, చందంపేట రోడ్డు, జోగిపేటఈ కార్యక్రమానికి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.కావున, ప్రతి వార్డులోని నూతన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కార్యక్రమం గురించి ముందస్తు సమాచారం అందించి, వారు కార్యక్రమానికి హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.అలాగే, కౌన్సిలర్ సభ్యులు మరియు కో-ఆప్షన్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం ఎంతో విలువైనది. మీ అందరి హాజరు, సహకారం ఈ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూరుస్తాయి. మీ అందరి హాజరు ఎంతో ముఖ్యం.ఇట్లు, మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి,వైస్,చైర్మన్ చిట్టి బాబుఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ
🏠 Home