🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 2:52 pm Posted by : TELANGANA KERATAM

యాదవ సోదరుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సదర్ సమ్మేళనం

News Image

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని పరిధిలోని జలకన్య హోటల్‌ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సదర్ సమ్మేళన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యాతిదులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ , చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొన్న ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా ప్రముకులు మాట్లాడుతూ యాదవ సోదరుల కృషిని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిందని, ఈ సంప్రదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.తెలంగాణ సంస్కృతి, యాదవ సోదరుల సంప్రదాయాలు, పశుపోషక సమాజ గౌరవానికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, డివిజన్ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువ నాయకులు, యువకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home