🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 2:55 pm Posted by : TELANGANA KERATAM

గ్రామస్థులకు సమాచారం లేకుండా గ్రామసభ నిర్వహణ..

News Image
-పంచాయతీ కార్యదర్శి తీరుపై యువకుల అభ్యంతరం...మనోహరాబాద్ తెలంగాణ కెరటం: గ్రామస్థులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించడంపై గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభ నిర్వహణకు సంబంధించి గ్రామంలో ఎలాంటి చాటింపు చేయకపోవడంతో పాటు ప్రజలకు సమాచారం అందించకుండానే సమావేశం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.గ్రామసభ అనేది గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో జరగాల్సిన ముఖ్యమైన సమావేశమని, ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం వల్ల గ్రామస్థులకు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతుందని యువకులు పేర్కొన్నారు.గతంలో కూడా ఇదే విధంగా గ్రామస్థులకు సమాచారం లేకుండానే గ్రామసభలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయంపై గ్రామస్థులు, యువకులు డీఎల్‌పీఓ మరియు మనోహరాబాద్ మండల ఎంపీడీఓ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై విచారణ జరిపి, భవిష్యత్తులో గ్రామసభలు ప్రజలందరికీ ముందస్తు సమాచారం అందించి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
🏠 Home