చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవ
ముఖ్యమైన పాయింట్స్:చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవ
*దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ
షాద్నగర్ నవంబర్ 14( తెలంగాణ కెరటం)
షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ, జయ జయ రామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీ రామ నామస్మరణతో మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్య, అర్చకులు, ప్రమోద్, సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిమామిడి శ్రీశైలం గౌడ్, ఎంసాని నరసింహులు, జి.వసంతరావు, అన్నారం రఘు గౌడ్, శ్రీశైలం యాదవ్, శంకర్ గౌడ్, లక్ష్మారెడ్డి, యాదగిరి, తులసి రామ్, రఘునందన్ రెడ్డి, సుప్ప నర్సింలు, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, శంకరయ్య, నరహరి, వీఆర్వో బచ్చన్న, సుప్ప కృష్ణయ్య, పి.ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, జగన్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, రవి, హనుమంత్ రెడ్డి, రవీందర్, నరసింహులు, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం మహిళలు తదితరులు పాల్గొన్నారు.