కన్నతల్లిపై హత్యాయత్నం చేసిన కుమారుడి అరెస్ట్
ముఖ్యమైన పాయింట్స్:కన్నతల్లిపై హత్యాయత్నం చేసిన కుమారుడి అరెస్ట్
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....మంచిర్యాల...మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌లో ఇల్లు ఖాళీ చేయించే విషయంలో తలెత్తిన వివాదంతో కన్నతల్లిపై రోకలి కర్రతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని మందమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలు:మందమర్రి విద్యానగర్‌కు చెందిన గాదె సారక్క (65) చెన్నూరులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆమె కుమారుడైన గాదె రాజమల్లు (46) విద్యానగర్‌లోని వారి సొంత ఇంటిలో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా ఇల్లు ఖాళీ చేయాలని తల్లి సారక్క కోరుతుండటంతో తల్లీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెలలో బంధువులు మరియు పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీ తీర్మానం మేరకు, రాజమల్లు ఇల్లు ఖాళీ చేసి మందమర్రి హెచ్.పి (HP) పెట్రోల్ బంక్ వెనుక భాగంలో ఒక అద్దె ఇంటిలోకి మారాడు. అయితే, తనను ఇల్లు ఖాళీ చేయించి బయటకు పంపించిందనే కోపం, కక్ష పెంచుకున్న రాజమల్లు ఎలాగైనా తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 14-11-2026 ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో సారక్క చెన్నూరు నుండి మందమర్రిలోని తన సొంత ఇంటికి వచ్చింది. ఇంటి తాళం తీసి ఇద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత, ఇల్లు ఖాళీ చేసే విషయమై మళ్ళీ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజమల్లు అక్కడే ఉన్న రోకలి కర్రతో తల్లి సారక్క తల ముందు భాగంపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర రక్తగాయమై కింద పడిపోవడంతో, నిందితుడు ఆ రోకలి కర్రను తీసుకొని అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి అరెస్ట్ & స్వాధీనం:సమాచారం అందుకున్న మందమర్రి పోలీసులు విచారణ చేపట్టి, ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో విద్యానగర్‌లోని నిందితుడి అద్దె ఇంటి వద్ద గాదె రాజమల్లును అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దాడికి ఉపయోగించి, ఇంట్లో దాచి ఉంచిన రక్తపు మరకలు గల రోకలి కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నట్లు మందమర్రి ఎస్.ఐ జి. నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు.