🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 9:08 pm Posted by : Kancharala Shivakumar

గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు... దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 14,తెలంగాణ కెరటం:

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 14,తెలంగాణ కెరటం:మద్యానికి బానిసై, జల్సాలు చేసేందుకు గొర్రెలను చోరీ చేసి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపారు.ఇటీవల దుబ్బాక మండలంలోని రామక్కపేట, పెద్ద చీకోడ్ శివారులోని గొర్రెల కొట్టం నుంచి గుర్తుతెలియని దొంగలు ఎనిమిది గొర్రెలను చోరీ చేశారు. ఈ క్రమంలో శనివారం దుబ్బాకలో జరిగే మూగజీవాల సంతలో గొర్రెలను విక్రయించేందుకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గొర్రెలను ఆటోలో తీసుకువచ్చారు.వారి మాటలను, అనుమానస్పద కదలికలను గుర్తించిన దుబ్బాక పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించగా, తామే రెండుచోట్ల గొర్రెలను చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరు నిందితులను దుబ్బాక పట్టణానికి చెందిన పి. శ్రీనివాస్, వి.నాగరాజు గా గుర్తించి, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఒక ఆటో, మూడు గొర్రెలు, ఒక మేకను స్వాధీనం చేసుకున్నారు.
🏠 Home