శ్రీ ఎస్.పి.ఆర్. గ్లోబల్ స్కూల్‌లో బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, న్యాయవాది కొలన్ హనుమంత్ రెడ్డి
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
శ్రీ ఎస్.పి.ఆర్. గ్లోబల్ స్కూల్‌లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని, టీపీసీసీ అధికార ప్రతినిధి సొంటిరెడ్డి పున్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, న్యాయవాది కొలన్ హనుమంత్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేసి ప్రదర్శించడం విశేషం. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వ్యాపార నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డేగల సతీష్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పిల్లల ప్రతిభకు ప్రోత్సాహం… వారి భవిష్యత్తుకు బంగారు బాట!
సొంటిరెడ్డిపున్నారెడ్డి
టీపీసీసీ అధికార ప్రతినిధి