🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 9:25 pm Posted by : TELANGANA KERATAM

కల్వకుర్తిలో ఘనంగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం

News Image
కల్వకుర్తిలో ఘనంగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం                                         తెలంగాణ కెరటం కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 14. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఘనంగా నిర్వహించారు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైనటువంటి వారికి చేయూత పెన్షన్లను పెద్ద ఎత్తున మంజూరు చేసిందని భవిష్యత్తులో కూడా ఇంకా మంజూరు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు. కార్యక్రమాన్ని స్థానిక సి కె ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వార్డు కౌన్సిలర్లు గ్రామ సర్పంచులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
🏠 Home