🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 9:33 pm Posted by : TELANGANA KERATAM

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

News Image
ముఖ్యమైన పాయింట్స్:కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా
750 మంది యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన 
ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో శనివారం మెట్‌పల్లిలోని వెంకట్ రెడ్డి గార్డెన్స్‌లో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 1,500 మందికి పైగా నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.సంజయ్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం విద్యను అందించడం మాత్రమే కాకుండా, యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఎమ్మెల్యే వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఇతర పదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా, స్థానికంగానే ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి వారికి అండగా నిలుస్తామని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ తెలిపారు.
🏠 Home