చేయూత పింఛన్లతో పేదలకు ఆత్మగౌరవ జీవితం
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమ రాజ్యంమంచుకొండలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి తుమ్మల
ఖమ్మం, నవంబర్ 14 (తెలంగాణ కెరటం): పేదలు తమ పిల్లలు, కోడళ్లపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆత్మగౌరవంతో జీవించేందుకు చేయూత: కొడుకు, కోడళ్ల వద్ద చేయి చాచకుండా వృద్ధులు, అర్హులైన లబ్ధిదారులు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందని తెలిపారు. విద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యత: పేదలు తమ సంపాదనను పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రఘునాథపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని, వేసవిలో సైతం చెరువులు నీటితో కళకళలాడేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. బుగ్గవాగు లిఫ్ట్ ద్వారా మండలంలోని చెరువులకు నీటిని అందించి వ్యవసాయానికి సాగునీటి భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. పామాయిల్‌తో రైతుల తలరాత మారుతుంది: పామాయిల్ సాగు రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చే సామర్థ్యం కలిగిన పంట అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో విపత్తుల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను తట్టుకొని రైతులకు ఆదాయం అందించే పంటగా పామాయిల్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. మెరక ప్రాంతంగా ఉన్న రఘునాథపాలెం మండలం పామాయిల్ సాగుకు అనుకూలమైన ప్రాంతమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు పామాయిల్‌తో పాటు తక్కువ నీటితో సాగు చేసుకునే కూరగాయలు, అపరాల పంటలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.
సీఎం సహకారంతో జిల్లా అభివృద్ధికి బాటలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మం జిల్లాలో సాగునీరు, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి బాటలు వేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.