తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
తహసీల్దార్ సంతకానికే టోకరా!
నకిలీ లేఖతో భూమి రిజిస్ట్రేషన్‌కు బ్రేక్!
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసుభూమి కోసం నకిలీ పత్రాల సృష్టి?
అధికారుల పేరుతో నకిలీ లేఖ.. పోలీసుల దర్యాప్తు
రూ.7.50 లక్షల చలానా వెనక్కి తెచ్చేందుకు కుట్ర చేశారన్న ఆరోపణ
ఘట్కేసర్లో ఫోర్జరీ కలకలం.. ముగ్గురు నిందితుల గుర్తింపు
సంతకం నకిలీ.. లేఖ బోగస్.. కేసు నమోదు
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు
భూమిని కాజేయేందుకే నకిలీ పత్రాల సృష్టి.. బాధితుడు బోయపల్లి కొండల్ రెడ్డి ఆరోపణ
రిజిస్ట్రేషన్ నిలిపివేసి, చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ సబ్‌రిజిస్ట్రార్‌కు నకిలీ లేఖ
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 14: తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, భూమి రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడంతో పాటు చలానా సొమ్మును తిరిగి పొందేందుకు నకిలీ లేఖ సృష్టించిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో నేర సంఖ్య 483/2026గా భారతీయ న్యాయ సంహితలోని 336(3), 337, 353(1) సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అన్నోజిగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 93/ఏఏలో ఉన్న రెండు ఎకరాల 18 గుంటల భూమితో పాటు మరో ఎకరం భూమికి సంబంధించి బోయపల్లి మల్లారెడ్డి 2024లో తన ముగ్గురు కుమారులు సత్తి రెడ్డి, కొండల్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిల పేర్లపై పట్టా మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం రూ.7.50 లక్షల చలానా చెల్లించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో సదరు భూమి వక్ఫ్ బోర్డు భూమిగా నమోదై ఉండటంతో పట్టా మార్పిడి ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.ఈ క్రమంలో రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసి, చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరుతూ ఘట్కేసర్ సబ్‌రిజిస్ట్రార్‌కు తహసీల్దార్ పేరుతో ఓ లేఖ అందింది. ఆ లేఖలో భూమి వెంకట నరసింహారెడ్డి, ఆయన న్యాయ వారసుల ఆధీనంలో లేదా హక్కుల పరిధిలో ఉందని, యాజమాన్యం, స్వాధీనంపై వివాదాలు ఉన్నాయని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసి, మల్లారెడ్డి చెల్లించిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం తిరిగి ఇవ్వాలని కోరారు.లేఖపై ఉన్న సంతకంపై అనుమానం రావడంతో మాజీ పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి తహసీల్దార్ బి. చంద్రశేఖర్‌ను సంప్రదించారు. ఆ సంతకం తనది కాదని, లేఖ నకిలీదని తహసీల్దార్ స్పష్టం చేయడంతో ఆగస్టు 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలగోని బల్రాజ్ గౌడ్, బాలగోని సుమన్ గౌడ్, గాదె యాదగిరి గౌడ్లను నిందితులుగా గుర్తించినట్లు సమాచారం. భూమిని కాజేయాలనే ఉద్దేశంతోనే బాలగోని బల్రాజ్ గౌడ్ బృందం నకిలీ పత్రాలు సృష్టించిందని పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆరోపించారు. తమ భూమిపై తప్పుడు ప్రచారం చేస్తూ పత్రికల్లో కథనాలు రాయించి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు అంశం నేపథ్యంలో చలానా చెల్లించామని, అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందామని తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.