🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 4:59 pm Posted by : TELANGANA KERATAM

టీపీఎస్ఎస్ రాష్ట్ర నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

News Image

రాష్ట్ర అధ్యక్షుడిగా తీగల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తూటి రాంచందర్ ఎన్నిక

(తెలంగాణ కెరటం) హైదరాబాద్ / నవంబర్ 15: తెలంగాణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ అమరారపు ఆడమ్, రాష్ట్ర అధ్యక్షుడిగా తీగల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తూటి రాంచందర్, సహాయ కార్యదర్శిగా ఎల్లేందుల స్వామి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పల్లెటి రవీందర్, గుర్రం రవీందర్ రెడ్డి, అంకమల్ల అంజయ్య, సహాయ కార్యదర్శులుగా బత్తుల ప్రదీప్, పి. ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తీగల వెంకటేష్ మాట్లాడుతూ విద్య, వైద్యం, నివాసం, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలను నివారించి అర్హులందరికీ న్యాయం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంతోపాటు ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. యువత, విద్యార్థులను గంజాయి, మత్తు పదార్థాల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ సమిష్టిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అలీ జిన్నా, ఎన్.ఎన్. రావు, రషీద్, మందుల రవి తదితరులు పాల్గొన్నారు

🏠 Home