🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 5:17 pm Posted by : TELANGANA KERATAM

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

News Image
ముప్పారం గ్రామ పాఠశాల-కస్తూర్బా పాఠశాలలో
ముఖ్య అతిథిగా ఎంపీడీవో అనిల్ కుమార్

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 15

హనంకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో భారత మొట్ట మొదటి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు మరియు బాలల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జరిగిన సమావేశానికి కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మాధవి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథి ధర్మసాగర్ మండల ఎంపీడీవో అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశానికి మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని ఆయనకు బాలికలు అంటే అమితమైన ప్రేమని ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం మరియు బాలల ప్రత్యేక గ్రామసభ జరుపుతున్నామని తెలిపారు. ఈసారి కస్తూర్బా స్కూల్లో జరపడం ఆనందదాయకంగా ఉందని కస్తూరిబా లాగా బాలికలు ఎదగాలని తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించి ఉన్నత చదువులు చదివి సమాజ సేవ చేయాలని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. అనంతరం ముప్పారం గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొట్టమొదటి ప్రధాని జహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల ప్రత్యేక గ్రామసభ మరియు సెల్ఫ్ గవర్నమెంట్ సమావేశానికి హెడ్మాస్టర్ రవీందర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఉపసర్పంచి తాళ్లపల్లి కుమార్ స్వామి పాల్గొని విద్యార్థుల సెల్ఫ్ గవర్నమెంట్ బాగుందని విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ ఆకారపు సురేష్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి, రిటైర్డ్ హెడ్మాస్టర్ ముంజ వెంకటరాజ్యం గౌడ్, బీసీ కాలనీ హెడ్మాస్టర్ రాజేందర్ రెడ్డి, ఎస్సీ కాలనీ హెడ్మాస్టర్ యామిని, వార్డు మెంబర్లు శ్వేతా సాగర్, కృష్ణవేణి, నారెడ్ల నరేష్, చిట్యాల సునీత, అన్నం పవిత్ర, గ్రామ పంచాయతీ కారోబార్ జీయర్, స్వామి, మర్రిపెల్లి రాజు, తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేచారు.

🏠 Home