🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 16 November 2026, 8:03 am Posted by : TELANGANA KERATAM

ఘట్‌కేసర్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు

News Image

 292వ వారపు నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 15: ఘట్‌కేసర్ పట్టణంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిర్వహించిన 292వ వారపు నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. సంస్థ ప్రతినిధి ఎం. అరుణ్ కుమార్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రతి ఒక్కరికీ సమాన హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను దేశానికి అందించారని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడమే కాకుండా, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి రాజ్యాంగ విలువలను కాపాడాలని సూచించారు.ప్రతి వారం క్రమం తప్పకుండా నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సామాజిక చైతన్యం, సమానత్వ భావనను పెంపొందిస్తున్న ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు నర్సింగరావు, సత్యం, లక్ష్మణ్, బాలకృష్ణ, నిఖిల్, కృష్ణ, దిలీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొని అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

🏠 Home