ముదిరాజ్ వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 15, నవంబర్
రాయికోడ్ మండలం ఖర్చర్ల గ్రామానికి చెందిన కప్పలి నాగమణి–శివయ్య దంపతులు, అవుసలి అరుణ–గోపాల్ దంపతుల కుటుంబాలకు చెందిన విశాల్, నిఖితల వివాహ వేడుకలు రాయిపల్లి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరై నూతన వధూవరులు విశాల్, నిఖితలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ నూతన వధూవరులు పరస్పర ప్రేమాభిమానాలు, అన్యోన్యతతో జీవితంలో ముందుకు సాగాలని, కుటుంబ పెద్దల ఆశీస్సులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కప్పాడ్ యాదగిరి, తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ శంకర్, యాదగిరి, తుల్జారామ్, మామిళ్ల ఆనంద్, రాము, సోము తదితరులు పాల్గొన్నారు.