డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు
ఖమ్మం, తెలంగాణ కెరటం :
అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినోత్సవ సందర్భంగా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో డాక్టర్ పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నాయకులు మంత్రి ని కలిసి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ విద్యాసంస్థల చైర్మన్ సీనియర్ అడ్వకేట్ డాక్టర్ పులిపాటి ప్రసాద్ తొండపు శ్రీనివాసరావు పట్నాయక్ వెంకటేశ్వరరావు హరీష్ కొంగర మాధవరావు బ్రహ్మారెడ్డి పవన్ సందీప్ తదితరులతో పాటు డాక్టర్ పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.