తెలంగాణ పోరాట ఉద్యమకారుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలి...
- తెలంగాణ పోరాట ఉద్యమకారుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలి...
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి
తెలంగాణ పోరాట ఉద్యమ కారుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలని, సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ పోరాట ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అడ్వైజర్ గుండా దాస్ ఎల్లం మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కష్టపడిన ఉద్యమకారులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్, ఇంటి స్థలం ఇస్తామని, మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. తెలంగాణ కోసం జైలు కేసులు, బైండవర్లు, ఎఫ్ఐఆర్ అయినా ఉద్యమకారులు అనేక మంది ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసి అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని అని కోరారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. కామారెడ్డి పట్టణంలో కళాభారతి లో జరుగు ఉద్యమకాల సమావేశం జరిపేలా తీర్మానించారు. తేదీ 16- నవంబర్- 2026 మేదులుకొని వారం రోజుల లోపు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు పూర్తి ఆధారాలతో ఆయా మండల ఇన్చార్జి లకు దరఖాస్తులు అందివాలన్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీ ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని ముఖ్యులకు వినతి పత్రాలు అందజేయాలని తీర్మానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సహకరించిన పాత్రికేయులకు ఉద్యమకారులకు వర్తించే రాయితీలపై చర్చించారు. క్రియాశీలక ఉద్యమ కళకారులకు అన్ని రకాల రాయితీలు వర్తించేలా తీర్మానించారు. ఈ సమావేశంలో రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి రాజేశ్వర్, రాజా గౌడ్, నాగర్తి మల్లేష్ రెడ్డి, ముదాం శంకర్ పటేల్ బాబు, అశోక్, రాజయ్య అబ్రబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.