🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 16 November 2026, 9:06 pm Posted by : TELANGANA KERATAM

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

News Image
 రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి-63పై గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలో 07-11-2026న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును,ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను హాజీపూర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, అవసరమైన హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు, వేగ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, అతివేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకర ఓవర్‌టేకింగ్‌ను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.చలికాలం కావడంతో రాత్రి వేళల్లో, తెల్లవారుజామున వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పోలీసు నిఘా, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
🏠 Home