వివాహా వేడుకలకు హాజరైన రాష్ట్ర నాయకులు సురభి నవీన్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలం వెంకటాపూర్, మెట్ పల్లి మండలం బండలింగాపూర్, మెట్పల్లి పట్టణంలో సోమవారం జరిగిన పలు వివాహా వేడుకలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పలువురు నియోజకవర్గ ప్రముఖులను సురభి నవీన్ కలిశారు. సురభి నవీన్ వెంట పలువురు బిజెపి కౌన్సిలర్లు, పలు మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, బిజెపి, బిజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.