🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 16 November 2026, 9:34 pm Posted by : TELANGANA KERATAM

ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన

News Image
 వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 16
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల లో కమ్యూనిటీ సోక్ పిట్ (ఇంకుడు గుంత) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన బిల్లా యాదగిరి సర్పంచ్ వేలేరు మేజర్ గ్రామపంచాయతీ, ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో డ్రైనేజీ కాలువల ద్వారా వస్తున్న నీటిని భూమిలోకి ఇంకింపజేసి, సామూహిక నీటి సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. భూగర్భ జలాల పెంపుకు ఉపయోగపడుతుంది. మరియు దోమల నివారణ కోసం, పిల్లలకు ఇబ్బందులు కలగకుండా, ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇంకుడు గుంతను నిర్మించడం జరుగుతుంది. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్ , జిపి కార్యదర్శి విజయ , ప్రధానోపాధ్యాయులు సత్యం , వార్డు సభ్యులు రణధీర్ రెడ్డి, ప్రశాంత్, ప్రవళిక, సునీల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home