🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 5:56 am Posted by : TELANGANA KERATAM

దుర్వినియోగమైన మున్సిపల్ ప్రజాధనాన్ని రికవరీ చేయాలి

News Image
కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు 
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు తమ వ్యక్తిగత ఇంటి పనుల కోసం మున్సిపల్ ఉద్యోగులను వినియోగించుకోని, సుమారు రూ.02.46 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ మెట్ పల్లి కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 10 మంది మున్సిపల్ ఉద్యోగులను వారి వ్యక్తిగత ఇంటి పనుల కోసం నియమించుకున్నారని, కాంగ్రెస్ పార్టీ పోరాటం వలన కొంత మందిని తిరిగి మున్సిపల్ కు పంపడం జరిగిందని తెలిపారు. అయినా గానీ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులను వారి ఇళ్లలో వ్యక్తిగత పనులు చేయడానికి నియమించుకుంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల తిరిగి మున్సిపల్ కు పంపడం జరిగిందన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు ప్రజలు చెల్లించిన పన్నుల నుండి జీతాలు చెల్లించబడ్డాయని, వారు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అధికారిక విధులను నిర్వహించినప్పుడు మాత్రమే ప్రజలు కట్టిన పన్ను మున్సిపల్ నుండి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలకు సంబంధించిన ఉద్యోగుల థంబ్ ఇంప్రెషన్, విధుల కేటాయింపు రికార్డులు, జీతాల వివరాలు, డ్యూటీకి సంబంధించిన ఉత్తర్వులను పరిశీలించాలని, ఉద్యోగులను వ్యక్తిగత పనుల కోసం వినియోగించుకోవడం అధికార దుర్వినియోగం, ప్రభుత్వ వనరుల దుర్వినియోగం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేయడంపై తీవ్రమైన అంశంగా పరిగణించి, సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ రైసోద్దీన్, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, 03,వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా  స్పోక్ పర్సన్ బత్తుల నరేష్, 11,వ వార్డు కౌన్సిలర్ గుడికందుల అజయ్, 20,వ వార్డు కౌన్సిలర్ మసుల ప్ర‌వీణ్, 21,వ వార్డు కౌన్సిలర్ ఖాజా ఆజీముద్దీన్, కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి జెట్టి లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్ల సురి తదితరులున్నారు.
🏠 Home