సాంఘిక సంక్షేమ వసతి గృహ పేరెంట్స్ కమిటీ ఏర్పాటు
నూతన అధ్యక్షుడిగా మ్యాదరి లక్ష్మణ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : కోరుట్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహ నూతన పేరెంట్స్ కమిటీని ప్రిన్సిపాల్ ఆద్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా కోరుట్ల పట్టణ 06,వ వార్డు (యాకిన్ పూర్) కు చెందిన మ్యాదరి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గా తర్రే మునీందర్, జనరల్ సెక్రెటరీగా దాసరి మనోజ్ కుమార్, సెక్రటరీగా కటకం అంజయ్య, జాయింట్ సెక్రటరీగా దేవులపల్లి శంకర్, ట్రెజరర్ గా ఎర్ర రాజేందర్, కమిటీ మెంబర్స్ గా నర్ర గంగారం, బోధనకారి వాణి, చంటి పవిత్ర, జక్కుల శిరీష, అంజి బాబు, మారంపల్లి రమేష్ లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ నియామకానికి ఏకగ్రీవంగా సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కమిటీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, నూతన పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకు రావాల్సిందిగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు.