🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 6:13 am Posted by : TELANGANA KERATAM

మండల ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

News Image

కోరుట్ల ఎంపిడివో వోదెల రామకృష్ణ 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : కోరుట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపిడివో వోదెల రామకృష్ణ సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కు సంబంధించిన ఒక దరఖాస్తు స్వీకరించినట్లు ఎంపీడీవో వోదెల రామకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకువస్తే, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, ఎస్సై బాబురావు, డిటి ఫరూక్, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home