🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 6:21 am Posted by : TELANGANA KERATAM

సంత్ సేవాలాల్ దేవాలయ భూమి పూజ మహోత్సవం

News Image

హాజరైన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో శ్రీశ్రీశ్రీ జగదాంబ మాత సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా బంజారా సంఘం ఆధ్వర్యంలో గీతా విద్యాలయం పక్కన నిర్వహించిన ఈ భూమి పూజ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు భుక్య నందు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణలు, సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాల మధ్య దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ పవిత్ర దేవాలయ నిర్మాణం బంజారా సమాజ ఆధ్యాత్మిక ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంధ్య రాణి సురేందర్, మాజీ జడ్పీటీసీ భుక్య సరళ, గోపాల్ నాయక్, బంజారా సంఘం ప్రధాన కార్యదర్శి లచ్చ నాయక్, రవి నాయక్, బోడ వెంకటేష్, భుక్య గోవింద్ నాయక్, టిజి యుఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, జరుపుల గోవింద్, రాజేందర్ నాయక్, లింబా నాయక్, గంగాధర్ నాయక్, తిరుపతి నాయక్, బాలు నాయక్, కౌన్సిలర్ దేవేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home