గోవులకు గడ్డిదానం ఎంతో పుణ్యం
ట్రాక్టర్ లోడ్ గడ్డి దానం చేసిన మద్దిరాల నరేష్, నాగ లోచని దంపతులు
*షాద్నగర్ నవంబర్ 16( తెలంగాణ కెరటం)
చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాల లోని గోవుల కోసం పట్టణానికి చెందిన మద్దిరాల నరేష్, నాగ లోచని దంపతులు వారి కుమార్తె హర్షిక కుమారుడు శ్యాంనాథ్ గోపాల్ ఒక ట్రాక్టర్ లోడ్ గడ్డిని దానం చేశారు. గోవులపై ప్రేమతో గడ్డిని దానం చేసినట్లు వారు తెలిపారు. గోవులకు గడ్డి దానం చేయడం పట్ల దేవాలయ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలాగే అర్చకులు రాఘవేంద్ర చార్య, మాజీ వార్డ్ సభ్యులు సింగపాగ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.