🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 6:33 am Posted by : TELANGANA KERATAM

కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఇంకా రెండేళ్లే గడువు

News Image

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 16, నవంబర్ 

మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు.. పెండింగ్‌లో ఉన్న పింఛన్లను వెంటనే మంజూరు చేయాలి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఇప్పటికైనా అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మూడేళ్ల తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొంటూ, ఇంకా పెండింగ్‌లో ఉన్న పింఛన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందక ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు.అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడు అందిస్తుందని ప్రశ్నించారు. కేవలం చెక్కుల పంపిణీకే పరిమితం కాకుండా, హామీ ఇచ్చిన తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలని కోరారు.
🏠 Home