🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 7:03 am Posted by : TELANGANA KERATAM

బి ఎన్ ఆర్ కే ఎస్ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలి

News Image
బి ఎన్ ఆర్ కే ఎస్ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలి 

మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం 

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 16

భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరిపల్లి చంద్రం గారి ఆదేశాల మేరకు బి-ఎన్-ఆర్-కే-ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్ హైద్రాబాద్ లోనీ మినిస్టర్ క్వాటర్స్ లో తెలంగాణ పశుసంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య సంపద, క్రీడలు మరియు యువజన సేవల శాఖ, మంత్రి వాకిటి శ్రీహరి గారిని కలసి మా కార్మికులకు రావలసిన సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు నుండి అందేవిధంగా చూడాలని కోరడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిస్కారం చేస్తానన్నారు. ఈ సందర్భంగా గిన్నారపు మహేందర్ మాటాడుతూ ఈ పథకాలు అమలు చేస్తే కార్మికులంతా మరోసారి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తామన్నారు. లేని యెడల మరింత ఉదృతంగా పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్రం లో కార్మికుల పట్ల జరుగుతున్నటువంటి పరిణామాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. మానవ సమాజానికి అందమైన రాజ భవనాలు కట్టి మనకి కనీసం నీడ లేని పరిస్థితిలు ఈ రాష్ట్రం లో నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు మన శక్తి సామర్ధ్యాల తో నిర్మించిన భవనలే కదా మన సృష్టి. ఈ మన సుదీర్ఘ పోరాటానికి ఒక మలుపు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా గత 20 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమ పోరాటాల ఫలితంగా 1996 చట్టం అని చెప్పుకోవచ్చు కానీ కార్మికుల సంక్షేమం కోసం ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు దక్కక పోవడం గమనార్హం 20 సంవత్సరాల ఉద్యమ పోరాటం లో ఎంతో మంది శ్రమ పడి రక్తం చిందించి అమరులై ప్రభుత్వం మీద వత్తిడి తీసుక రావడం లో ప్రధాన పాత్ర పోషిస్తు కార్మికులని చైతన్య పరుస్తూ 1996 చట్టం రావడానికి అనేక సందర్భాల్లో మీటింగు లు రాస్తా రోకో లు చేసి ప్రభుత్వం మెడలు వంచి చట్టాన్ని సాధించే దిశగా ఉద్యమం చేశాము అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1996 చట్టాన్ని అమలు చేయడం జరిగింది. కానీ గత 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో చట్టాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మళ్ళీ మా జీవితల్లో ఒక నూతనోత్సాహం కలిగింది. నిర్వీర్యం చేసిన చట్టాన్ని మళ్ళీ అవి ఇంప్లిమెంట్ చేయాలని ఆవేదనను వ్యక్తం చేస్తూ మా కార్మిక ల పక్షాన మీరు ఒక్కసారి అసెంబ్లి లో మా గోడును వినిపించాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.
🏠 Home