ఆంబులెన్స్కు అడ్డుగా వాహనాలు.. మునగాల దవాఖాన వద్ద తీవ్ర ఇబ్బందులు!
ఆంబులెన్స్కు అడ్డుగా వాహనాలు.. మునగాల దవాఖాన వద్ద తీవ్ర ఇబ్బందులు!
మునగాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కొందరు వాహనాలను అడ్డంగా నిలపడం వల్ల రోగులు, అత్యవసర ఆంబులెన్స్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆసుపత్రి గేటు ముందే వాహనాలు ఆపుతుండటంతో.. వైద్యం కోసం వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అత్యవసర సమయంలో ఆసుపత్రికి వచ్చే వారికి ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి, ఆసుపత్రి ఎదుట 'నో-పార్కింగ్' బోర్డులు ఏర్పాటు చేయాలని, అడ్డంగా వాహనాలు ఆపే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.