తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడటంతో పాటు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తనపై నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని గడ్డం ఇందుప్రియ స్పష్టం చేశారు.