🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 3:48 pm Posted by : G GOPAL

పిల్లల ప్రజావాణికి విశేష స్పందన – 148 ఫిర్యాదులు స్వీకరణ

News Image
పిల్లల ప్రజావాణికి విశేష స్పందన – 148 ఫిర్యాదులు స్వీకరణ
కామారెడ్డి: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, కామారెడ్డి ద్వారా నిర్వహించిన “పిల్లల ప్రజావాణి (PILLALA PRAJAVANI)” కార్యక్రమానికి పిల్లల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 148 ఫిర్యాదులు, వినతులు స్వీకరించడం జరిగింది.బాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పిల్లలు  తమ ఫిర్యాదులను అందజేశారు . స్వీకరించిన 148 ఫిర్యాదులను సంబంధిత అంశాల వారీగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, బాలలకు సంబంధించిన సమస్యలను ఎవరైనా నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.బాలల రక్షణ, సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని, బాలల సమస్యల పరిష్కారంలో ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సంబంధిత శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కోరారు.
🏠 Home