🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 7:27 pm Posted by : Kancharala Shivakumar

దుబ్బాక అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలి – సీఎం రేవంత్ రెడ్డికి వినతి -దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేయాలి -డీడీఎఫ్ అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్

News Image
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, అఖండ దీపం:
సిద్దిపేట జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేయడంతో పాటు, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని దుబ్బాక డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యం, రహదారులు వంటి కీలక రంగాల్లో దుబ్బాక నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. ఫలితంగా యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, చిన్న, పెద్ద పరిశ్రమలు దుబ్బాక నియోజకవర్గంలో నెలకొల్పే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీడీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్గల రాజేశ్, జాయింట్ సెక్రటరీ చారి, సభ్యులు శివ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home