🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 7:41 pm Posted by : Kancharala Shivakumar

ఈ నెల 19న సీఎం సభను విజయవంతం చేయాలి -సిద్దిపేట గడ్డపై బీఆర్ఎస్ పదేళ్ల పాలన వైఫల్యాలను ప్రజల ముందుంచుతాం

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, తెలంగాణ కెరటం:

ఈ నెల 19న సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు సిద్దిపేటలో సీఎం సభ నిర్వహించనున్న ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు.అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట గడ్డపై నుంచి గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రజల ముందుంచుతామని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ సభ వేదికగా నిలవనుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేసి భారీ సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home