🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 8:33 pm Posted by : D RAMAKRISHNA

8 వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

News Image

8 వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


  • ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్క్రీడల నిర్వహణ పనులు వేగంగా పూర్తి చేయాలి
  • సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడల నిర్వహణ పై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం, నవంబర్ 17 (తెలంగాణ కెరటం): 8 వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. మంగళవారం కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ లతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడల నిర్వహణ విజయవంతానికి చేపట్టే పనులు నాణ్యతలో రాజీ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రూ. 3.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనుమతులు మంజూరై, ఒప్పందం పూర్తయిన పనుల్లో కొత్తగా నిర్మించిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌కు కావాల్సిన లైటింగ్ సదుపాయాల ఏర్పాటు చేయాలన్నారు. సింథటిక్ ట్రాక్‌కు అదనపు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చైన్ లింక్ మెష్ ఏర్పాటు, ప్రహరీ గోడ నిర్మాణం,  ఇంటర్‌లాకింగ్ కాంక్రీట్ బ్లాక్ పేవ్‌మెంట్ల నిర్మాణం, అల్యూమినియం స్తంభాలతో హ్యామర్ త్రో కేజ్ ఏర్పాటు,  స్టేడియం గేటు, ఆర్చ్ నిర్మాణం మరుగుదొడ్ల మరమ్మతులు, పెయింటింగ్, టైల్స్ మొదలైన వసతుల కల్పన పనులు చేయాలన్నారు. క్రీడాకారులకు, సందర్శకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాన భవనం ప్రవేశ ద్వారం నుండి మెయిన్ గేట్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం, ప్రధాన భవనంలోని అథ్లెట్లు,  కార్యాలయ గదులకు పెయింటింగ్, తలుపులు, కిటికీల అమరిక, ఎలక్ట్రికల్ మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ లెవలింగ్, నేమ్ బోర్డుల ఏర్పాటు, సీటింగ్ గ్యాలరీల వద్ద టెన్సైల్ కోనికల్ స్ట్రక్చర్ షేడ్ ఏర్పాటు, ప్రధాన భవనంలోని అథ్లెట్, ఆఫీస్ టాయిలెట్ల మరమ్మతులు, గీజర్ల ఏర్పాటు,  పార్కింగ్ ప్రాంతంలో చిప్స్ వేయడం, స్టేడియం ప్రాంగణంలో వీధి దీపాల ఏర్పాటు, ఓపెన్ వెల్ సబ్‌మెర్సిబుల్ మోటార్ ఏర్పాటు, సంప్ నుండి నీటి ట్యాంకులకు కనెక్షన్ల కల్పన,  పీజీ కళాశాల మైదానం శుభ్రపరచడం, చదును చేయడం, నిరుపయోగ వాహనాల తరలింపు, టేబుల్ టెన్నిస్ కోర్టు పక్కన సీసీ డ్రైన్ నిర్మాణం, ప్రధాన భవనం పక్కనున్న 2 గ్యాలరీలకు పెయింటింగ్, ఓహెచ్‌ఎస్ఆర్ ట్యాంకుకు ఆర్టిస్టిక్ గ్రాఫిక్ పెయింటింగ్,  స్విమ్మింగ్ పూల్ గదులు, ఇతర చిన్న తరహా మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఖేలో ఇండియా క్రీడల సమయానికి ముందుగానే పనులన్నీ నాణ్యతతో పూర్తి చేసి, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ టి. సునీల్ కుమార్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, హార్టికల్చర్ అధికారిణి అనితశ్రీ, డిఇ నాగజ్యోతి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ జయచందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Additional News Photo
🏠 Home