🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 11:03 pm Posted by : NARESH PIPPARA

మహాభారతం* *అరణ్యపర్వం: యక్ష ప్రశ్నలు*

News Image
  • యక్షుడు అన్నాడు, ‘నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదా నీ నలుగురు తమ్ముళ్ళ లాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను.’ అని. ఆ యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు, స్వయానా, మారు వేషంలో ఉన్న మృత్యు దేవత అయిన యమధర్మరాజు. ఆయన అరవై ప్రశ్నలను అడిగాడు, వాటన్నిటికీ యుధిష్ఠిరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు. ఈ ప్రశ్నలలో ఒకటి : కిం ఆశ్చర్యం? ‘ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?’ యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు:
  • అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం
  • శేషాః స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమతః పరం
  • (మహాభారతం)
  • ‘ప్రతి క్షణం మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజు మనమూ చని పోతాము అనిమాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది?’
*మహాభారతం*
*అరణ్యపర్వం: యక్ష ప్రశ్నలు*
(చేపలు ఆహారంగా తిని బ్రతికే కొంగ రూపంలో ఉన్న యక్షుడు)
1. యక్ష ప్రశ్న: ఏది సూర్యుణ్ణి ఉదయింపచేస్తుంది? ఏది సూర్యుణ్ణి అస్తమింపచేస్తుంది? ఎవరు అతనితో కూడా ఉంటారు? ఎవరు అతన్ని కదిలించేది? 
ధర్మరాజు జవాబు: బ్రహ్మము అతన్ని ఉదయింపజేస్తున్నది. ధర్మము అతన్ని అస్తమింపజేస్తున్నది. దేవతలు అతడితో కూడా ఉంటున్నారు. సత్యమే అతని కదిలిస్తున్నది.
2. యక్ష ప్రశ్న: ఏది గొప్ప భాగ్యం?
ధర్మరాజు జవాబు: ఆరోగ్యం. 
3. యక్ష ప్రశ్న: గొప్ప ఆనందం ఏది?
ధర్మరాజు జవాబు సంతృప్తి. 
4. యక్ష ప్రశ్న: నిజమైన జ్ఞానం ఏది?
ధర్మరాజు జవాబు: భగవంతుని తెలుసుకోవడమే.
 5. యక్ష ప్రశ్న: దయా అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు: అందరూ సంతోషంగా ఉండాలనుకోవడమే.
6. యక్ష ప్రశ్న: అజ్ఞానం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు: తన కర్తవ్యం తెలుసుకోకుండుటే. 7. యక్ష ప్రశ్న: ఎవడు ఉత్తముడు?
ధర్మరాజు జవాబు: అందరి మంచినీ కోరేవాడు.
8. యక్ష ప్రశ్న: సోమరితనం ఏది?
ధర్మరాజు జవాబు: తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవడం.
9. యక్ష ప్రశ్న: ఒకరిని బ్రాహ్మణునిగాను చేసేది జన్మ, శీలం, అధ్యయనం, వివేకం వీటిలో ఏది?
ధర్మరాజు జవాబు: జన్మ, అధ్యయనం, వివేకం ఇవేవీ కావు. శీలం మరియు నడవడి మాత్రమే ఒకరిని బ్రాహ్మణుడిగా చేస్తున్నది.
10. యక్ష ప్రశ్న: నిజమైన సంతోషి ఎవడు?
ధర్మరాజు జవాబు: రుణం లేని వాడు నిజమైన సంతోషి.
11. యక్ష ప్రశ్న: ప్రపంచంలో అత్యంత విచిత్రమైనదేది?.
ధర్మరాజు జవాబు: కొన్ని వేల మంది రోజు మరణిస్తున్నారు. అదే సమయంలో బ్రతికి ఉన్నవాళ్లు తాము మాత్రం శాశ్వతంగా ఉంటామని భావించుకుంటారు. అదే అన్నింటికంటే విచిత్రమైన విషయం.
12. యక్ష ప్రశ్న: సంతోషానికి మంచి మార్గం ఏది? 
ధర్మరాజు జవాబు: సత్ప్రవర్తనలు నడిచిన వెళ్లిన దారే.

అప్పుడు యక్షుడు ఇలా అన్నాడు నాయనా నా ప్రశ్నలన్నింటికీ తృప్తికరంగా జవాబులు ఇచ్చావు. కాబట్టి నీ సోదరులలో ఒక్కరిని బ్రతికిస్తాను. కోరుకో అందుకు ధర్మరాజు ఓ యక్ష నల్లని దేహం గలవాడైన నకులున్ని బ్రతికించు అన్నాడు ఆ మాటలకు యక్షుడు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు. భీముడు నీకు మిక్కిలి ప్రియుడు అంటారు. అర్జునుడు నీ బలానికి మూలాధారం అటువంటప్పుడు నీ సవతి తమ్ముడైన నకులను ఎందుకు ఎంచుకున్నావు ధర్మాన్ని బలిపెట్టేవాడు నశిస్తాడు. కాబట్టి నేను ధర్మాన్ని బలి చేయను నా తండ్రి గారికి ఇద్దరు భార్యలు కుంతీ, మాద్రి. నేను వారిద్దరిని సమానంగా చూస్తాను. వారిలో నాకే భేదము కనబడదు. నకులుడు బ్రతికితే మాద్రి కుమారుల్లో ఒకరు బ్రతికి ఉంటారు అన్నాడు. ఆ మాటలు అంటూ ఉండగానే సోదరులందరూ నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచారు. వారి బడలిక దాహం అన్ని మాయమైపోయినాయి. అప్పుడు ధర్మరాజు ఒకే కాలు మీద తటాకంలో నిలబడ్డ నీవు ఒక సామాన్య యక్షుడివి కావు నువ్వు ఏ దైవానివి అని అడిగాడు. యక్షుడు నవ్వుతూ నాయన నేను *యమధర్మరాజును నీ తండ్రిని* నిన్ను చూసి సంతోషిస్తున్నాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఒక బ్రాహ్మణుడి అగ్నిహోత్రం రగిలించే అరని లేడు తో సహా మాయమైనది. ఆ అరణి ప్రసాదించండి అన్నాడు. ధర్మరాజు యక్షుడు నవ్వుతూ నిన్ను పరీక్షించాలని నేను లేడీ రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుడి అరణిని మండే కట్టెలను ఎత్తుకుపోయాను. మరేదన్న వరం కోరుకో అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు మేము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాం. మా అజ్ఞాతవాసంలో ఎవరు మమ్మల్ని గుర్తించకుండా వరం ఇవ్వు అన్నాడు. అప్పుడు యమధర్మరాజుల అన్నాడు ఈ వరం కూడా నీకు ఇస్తున్నాను. మీరు మారువేషంలో లేకుండా తిరిగినప్పటికీ ఈ త్రిలోకాలలో మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు. మీ అజ్ఞాతవాసి సంవత్సర కాలాన్ని విరాట నగరంలో గడపండి కోరిక కోరిన రూపాన్ని ధరించే శక్తి మీకు వస్తుంది. అలా అంటూ యమధర్మరాజు అంతర్దనం అయినాడు. పాండవులు ఆనందంగా ఆశ్రమానికి తిరిగి వచ్చారు. బ్రాహ్మణుల వద్ద సెలవు తీసుకుని అజ్ఞాతవాసి కాలాన్ని ఎలా గడపాలో దౌమ్యుడితో చర్చిస్తూ ముందుకు బయలుదేరారు.

*అరణ్యపర్వం సమాప్తం*
🏠 Home