🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 6:22 am Posted by : TELANGANA KERATAM

జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్ల విజయం.

News Image
జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్ల విజయం.....

బాలుర విభాగంలో మంచిర్యాల జట్టు ప్రథమ స్థానం..
 బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జట్టు విజేత
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల...
మందమర్రి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 బాలుర, బాలికల నెట్‌బాల్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ఉదయం ఈ పోటీలను మందమర్రి మండల విద్యాధికారి రాథోడ్ రమేష్ ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.
విజేతలుగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్లు
ఈ పోటీల్లో బాలుర విభాగంలో మంచిర్యాల జట్టు విజేతగా నిలవగా, ఆసిఫాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జట్టు విజేతగా నిలవగా, ఆదిలాబాద్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి సీఐ పర్స రమేష్, ఎస్ఐ జి. నరేష్, సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) అశోక్, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకుబ్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రాం వేణు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పోటీల నిర్వహణకు వేదిక కల్పించి సహకరించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యాన్ని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు), క్రీడాకారులు, తల్లిదండ్రులు, పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home